ప్రయాగ్ రాజ్‌లో తిరుమల శ్రీవారి గంగా హారతి !

J.SURENDER KUMAR,


మహా కుంభమేళా సందర్భంగా తిరుమల అర్చకులు ప్రయాగ్‌రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్‌లో శుక్రవారం సాయంత్రం గంగాహారతి నిర్వహించారు.

వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ శ్రీనివాస స్వామి దశాశ్వమేధ ఘాట్ వద్దకు వెళ్లి గంగా నది ఒడ్డున హారతి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు  వేణుగోపాల దీక్షితులు, డిప్యూటీ ఈవో  గుణభూషణ్‌రెడ్డి, సూపరింటెండెంట్‌  గురురాజస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.