రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ లో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన రాజీవ్ గాంధీ అల్ ఇండియా అండర్ 19 T-20 డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారటి చైర్మెన్ శివ సేన రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మొదట స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఫైనల్స్ లో పోటీ పడుతున్న ఇరు జట్ల క్రీడ సభ్యుల పరిచయ కార్యక్రమం అనంతరం ప్రారంభమైన క్రికెట్ మ్యాచ్ ను ఎమ్మెల్యే తిలకించారు.