రాయపట్నం రహదారి లో వంద కోట్ల తో ఆసుపత్రి !

👉మంత్రి దామోదర్ రాజనర్సింహ మంజూరుకు హామీ ఇచ్చారు !

👉 కేంద్ర ప్రభుత్వ నిధులతో..

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు గోల్డెన్ అవర్ లో వైద్య సేవలు కోసం అత్యాధునిక వసతులతో రాయపట్నం – కరీంనగర్ రాష్ట్ర రహదారిలో ₹ 100 కోట్ల రూపాయల నిధులతో త్వరలో ‘ ట్రామా ‘ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నట్టు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి పట్టణంలో సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తో కలిసి కొట్లాది రూపాయల నిధులతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కుమార్ మాట్లాడారు.


రోడ్డు ప్రమాదలలో క్షతగాత్రుల ప్రాణాల రక్షణ కోసం ( వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్ లో ) త్వరితగతిన వైద్య సేవలు అందించడం కోసం రాయపట్నం కరీంనగర్ రాష్ట్ర రహదారిలో పాసిగామా వద్ద ‘ ట్రామా ‘ ఆసుపత్రి నిర్మాణానికి ₹100 కోట్ల నిధులు మంజూరు చేస్తానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వ పథకం అని ఎమ్మెల్యే అన్నారు.


👉100 కిలోమీటర్ల దూరం వరకు ఆస్పత్రి లేదు !


మంచిర్యాల జిల్లా దండేపల్లి, హాజీపూర్ జగిత్యాల జిల్లా ధర్మపురి, వెలగటూర్, పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో కి రహదారి వస్తుందని. 63 జాతీయ రహదారి దండేపల్లి, హాజీపూర్, పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలలో. క్షతగాత్రులకు అత్యవసర ఆక్సిజన్, వెంటిలేటర్, వైద్య సేవల కోసం దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ జిల్లా కేంద్రానికి తరలించాల్సిన దుస్థితి అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు.


పూర్తి వివరాలను మంత్రికి వివరించి ‘ ట్రామ ‘ ఆస్పత్రి మంజూరుకు విజ్ఞప్తి చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
వెల్గటూరు మండలం ( రహదారిపై ఉన్న ) పాశిగామ గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఆసుపత్రి నిర్మాణం కు కేటాయించామన్నారు.


ఈ ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సిబ్బంది, ఆక్సిజన్, వెంటిలేటర్, ఐ సి యు, ఆపరేషన్ థియేటర్, బ్లడ్, అంబులెన్స్ సౌకర్యం, నిపుణులైన వైద్యులు, తదితర వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే వివరించారు.