👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
నంది మేడారం రిజర్వాయర్ ను అధికారులు మండల నాయకులతో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించి, రిజర్వాయర్ నీటి నిల్వను సక్రమంగా మెయింటెయిన్ చేయాలని, రిజర్వాయర్లో సరిపడ నీటి నిల్వ ఉంచుకొని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ధర్మారం మండలం మేడారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నంది మేడారం రిజర్వాయర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రజాపాలన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం గ్రామ సభ నిర్వహించి అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు.

లిస్టులో పేర్లు రాని వారు ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని అర్థులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందింపజేస్తమని, ధర్మపురి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని ఈ సందర్భంగా అన్నారు.