రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 ఇరిగేషన్ అధికారులు గోదావరిలోకి నీటి నీ విడుదల చేస్తున్నారు !

👉 సాగునీరు అందించే బాధ్యత మాది !


J.SURENDER KUMAR,


గోదావరి నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా పంటలు సాగు చేసుకుంటున్నా జగిత్యాల ధర్మపురి నియోజకవర్గాల రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇరిగేషన్ అధికారులు గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతాంగానికి హామీ ఇచ్చారు.


హైదరాబాదులో సి.ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


గోదావరి నదిలో సరిపడ నీటి లభ్యత లేకపోవడంతో లిఫ్ట్ ద్వారా సాగు చేస్తున్న పంటలకు కొరత ఏర్పడింది అన్నారు.
తాను, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి క్షేత్రస్థాయిలో గోదావరి నది తీర ప్రాంతాలు పర్యటించి నీటీ విడుదల కోసం ఈ నేల 3 న సంబంధింత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించగా వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 8న జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి 12 ఎకరాల పంటల కు సాగునీటి విడుదల గురించి వివరించగా ఆ దిశగా కార్యాచరణకు కలెక్టర్ కార్యాచరణ కు శ్రీకారం చుట్టారు అని ఎమ్మెల్యే అన్నారు.


రైతాంగానికి సాగు నీటి సమస్య ఇబ్బందులూ కలగకూడదనే ఉద్దేశ్యంతో ముక్కోటి ఏకాదశి పర్వదినం అయినా ఉదయాన్నే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకొని హైదరాబాద్ కు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో వచ్చి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ కలసి సాగునీటి విడుదల కోసం ప్రత్యేకంగా సమావేశమై రైతుల పరిస్థితినీ వివరించి గోదావరిలో ఒక టిఎంసి నీటిని విడుదల చేయాలని కోరినట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు.


👉గత బి ఆర్ ఎస్ పాలనలో…


గత బి.ఆర్.ఎస్ పాలకులు తలపున గోదావరి ఉన్న, మేడారం రిజర్వాయర్ ఉన్న ఈ ప్రాంత నీటిని సిరిసిల్ల, సిద్దిపేటకు తరలించారు తప్ప రైతుల సాగు నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపలేదని, ఆరోపించారు.
రోళ్ళ వాగు ప్రాజెక్ట్ 2016 సంవత్సరంలో ₹ 60 కోట్లతో ప్రారంభించి, దాని అంచనా వ్యయాన్ని ₹ 140 కోట్లకు పెంచారు తప్ప ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఎమ్మెల్యే ఆరోపించారు.
గత ప్రభుత్వంలో విప్ గా, మంత్రిగా కొనసాగిన కొప్పుల ఈశ్వర్, మేడారం ద్వారా మన నీటిని హరీష్ రావు, దోచుకెళ్తుంటే ప్రేక్షక పాత్ర వహించాడన్నారు. ,రోళ్ల వాగు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకరాలేక పోయారని, రంగధాముని చెరువు వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి గొల్లపెల్లి, పేగడపెల్లి, వెల్గటూర్ గ్రామాలకు సాగు నీరు అందించే ప్రయత్నం చేయలేదని, గత పది సంవత్సరాల బి.ఆర్.ఎస్ హయంలో రైతులకు చేసిన మేలు ఏమిటో చెప్పలని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతుల పై ఇప్పుడు కపటప్రేమ చూపిస్తూ, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరని, రైతులు ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని సాగునీరు అందించే బాధ్యత మాది అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.