👉త్వరలో రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం !
J.SURENDER KUMAR,
త్వరలోనే రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ధర్మపురి రైతాంగ కు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటాం అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మండలం ధమ్మనపేట, రాజారాం, జైన గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన రైతులతో ఎమ్మెల్యే మాట్లాడారు. గోదావరిలో నీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను నేను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వయంగా చూసి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఒక టిఎంసి నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్టు రైతులకు వివరించారు.

వెంటనే స్పందించి ఒక టిఎంసి నీటినీ విడుదల చేయాలని అధికారులను వారు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం నీటిని గోదావరిలోకి విడుదల చేయడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, గత ప్రభుత్వంలో విప్ గా, మంత్రి గా కొనసాగిన కొప్పుల ఈశ్వర్, మేడారం రిజర్వాయర్ ద్వారా సిరిసిల్లకు, సిద్దిపేటకు హరీష్ రావు నీటినీ తరలిస్తున్న అభ్యంతరం వ్యక్తం చేయక కేవలం ప్రేక్షక పాత్రను మాత్రమే వహించారని ఎమ్మెల్యే ఆరోపించారు.

పది సంవత్సరాలు అధికారంలో ఉండి ,రోళ్లవాగు ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ₹60 కోట్ల నుండి ₹140 కోట్లకు పెంచారు తప్ప దాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయారనీ, ఆరోపించారు. కనీసం ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతులు సాధించడం కూడా తెలియదు అన్నారు.
రైతుల పైన కపట ప్రేమను నటిస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం జరుగుతుందని, వారి కల్లబొల్లి మాటలు నమ్మే స్థితిలో రైతాంగం లేదని, లిఫ్ట్ పై ఆధారపడి సాగు చేసుకునే ప్రతి రైతును రక్షించుకుంటామన్నారు. రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే జిల్లా ఇరిగేషన్ అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఇటు రోళ్ళవాగును పూర్తి చేసి రైతులకు సాగు నీటి విషయంలో శాశ్వత నీటి పరిష్కారానికి చూపుతోని ఎమ్మెల్యే అన్నారు.
👉పరామర్శ..

ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన వాసం సత్తయ్య నివాసం విద్యుత్ఘాతంతో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయింది. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ శనివారం సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించి అగ్ని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు, అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
స్థానికులు విద్యుత్ వైర్లు కిందకు ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు.