👉 ఈనెల 26 నుంచి అమలులోకి. !
J.SURENDER KUMAR,
రైతు భరోసా పథకం కింద రైతులకు ఈనెల 26 వ తేదీ నుంచి పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
👉 భూ భారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025) పేర్కొంది.
👉 రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపైన తెలుగులో జీవో జారీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా జీవోను కూడా తెలుగులో వెలువరించింది.
👉 తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయుటకు కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి మరియు అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చు.

👉 ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి మరియు ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
👉 ఇందుకోసం, తెలంగాణ ప్రభుత్వం “రైతుభరోసా” పథకాన్ని అమలుచేయడానికి నిర్ణయించింది. ఈ పథకం జనవరి 26, 2025 నుండి అమలు చేయబడుతుంది.
👉 రైతుభరోసా పథకంలోని ముఖ్యాంశాలు:
👉 రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు ₹12,000 కు పెంచబడింది.
👉 భూభారతి (ధరణి) పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.
👉 ROFR పట్టాదారులు కూడా రైతుభరోసాకి అర్హులు.
👉 RBI నిర్వహించే DBT పద్ధతిలో రైతుభరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలి.
👉 రైతుభరోసా పథకం వ్యవసాయశాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు.
👉. National Informatics Centre (NIC), IT భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
👉. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు మరియు ఫిర్యాదుల పరిష్కరణ కోసం బాధ్యులుగా ఉంటారు.