రైతు సంక్షేమంలో రాజీపడే ప్రసక్తి లేదు మంత్రి శ్రీధర్ బాబు!

👉మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,


మంథని నియోజకవర్గం లో ఆదివారం ముత్తరం మండలంలో మచ్చుపేట సీనియర్ నాయకులు దుండే రాజేశం, మైదంబండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బియ్యని ఎల్లం ఇటీవల మరణించగా ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు వారి కుటుంబ సభ్యులని పరామర్శించి వారిని ఓదార్చారు.


👉 మంథని నియోజకవర్గం లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ


శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతులకు ₹ 21 వేల కోట్లతో రుణమాఫీ చేయడం జరిగిందని, సన్నాలకు క్వింటల్ కు ₹ 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని మంత్రి అన్నారు.


👉, ఈనెల 26 జనవరి నుండి రైతులకు రైతు భరోసా పథకం ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. రైతులకు సంబంధించిన రైతు బోనస్ను మర్చిపోయారని ప్రతిపక్షాలకు చెందినవారు రైతులను అయోమయంలో గురిచేసి పబ్బం గడుపుతున్నారని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.


👉 రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని ఇప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని మరోసారి తెలిపారు.


👉మంథని ముత్తారం మండల కేంద్రం నుండి మంథని వరకు ₹60 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆర్ఎంపి అధికారులను ఆదేశించారు.


👉ఓడేడు మానేరు నదిపై గత ప్రభుత్వ హయాంలో వంతేన నిర్మాణం మొదలుపెట్టిన నిర్మాణంలో జాప్యం చేసి నాసిరకం నిర్మాణం చేపట్టడం వల్ల గాలి వానకే బ్రిడ్జిపై ఉన్న గేడర్లు కూలిపోయాయని, ఆ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులు, డ్యామ్ లు కూలి పోయాయని మంత్రి అన్నారు.


👉మరోసారి ఓడేడు మానేరు నదిపై వంతెనను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని టెండర్లు పూర్తయి కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టారని, ఇంజనీరింగ్ అధికారులు బ్రిడ్జి నిర్మాణం నాణ్యతతో, సరైన సమయంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. అధికారులను ఆదేశించారు.