👉 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు !
J.SURENDER KUMAR,
పంటలకు సాగునీటి విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిల చిత్రపటాలకు కు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాలాభిషేకం చేశారు.
గోదావరిలో నీళ్ళు లేకపోవడంతో రైతుల సాగుకు ఇబ్బంది కలుగుతుందని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించిన సంధర్భంగా గురువారం ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామంలోని గోదావరి నది లో, రైతులతో కలసి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గోదావరి నదీ తల్లికి పూజలు చేశారు.అనంతరం ధమ్మన్న పేటలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి సాగునీటివి విడుదల చేసారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గోదావరిలో నీళ్ళు లేక సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు నా దృష్టికి తీసుకువచ్చి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించి ఒక టీఎంసీ నీటిని గోదావరిలో విడుదల చేయాలని విన్నవించినట్టు తెలిపారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినం అయినప్పటికీ ప్రత్యేకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశమై నీటి విడుదల గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు.
నిబంధనలకు అనుగుణంగా ఏ ప్రాంతానికి ఎంత నీళ్ళ వాట కేటాయింపు పైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి విడుదల కొంత కష్టమని అన్నారు. ఒక టీఎంసీ నీటిని విడుదల చేసినప్పటికి గోదావరి లిఫ్ట్ వరకు సాగు నీరు అందదని ఇరిగేషన్ అధికారులు వివరించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో ఇరిగేషన్ అధికారులతో ఏ పద్ధతిలో నీటిని విడుదల చేస్తే జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలకు నీరు అందుతుందో తన అనుభవం ద్వారా వివరించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
స్పందించిన మంత్రి అంగీకరించి జగ్గసాగర్ నుండి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.