సాగునీటి కోసం రైతాంగం ఆందోళన వద్దు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


సాగునీటి కోసం రైతన్న ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, రెండు రోజుల్లో పంట పొలాలు ఎండిపోకుండా నీటిని విడుదల చేయించడానికి నా శాయిశక్తుల కృషి చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులు సాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కలసి వివరించారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
సదర్ఘాట్ వద్ద గేట్ల నిర్మాణం కారణంగా గోదావరిలో నీరు లేక గోదావరి నది లిఫ్ట్ ప్రాజెక్టు పై ఆధారపడి వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతులలో ఆందోళన పరిస్థితి నెలకొందన్నారు.

👉 సాగునీటి అంశం గూర్చి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి పోచంపాడు ప్రాజెక్టు ద్వారా గాని, కడెం ప్రాజెక్టు ద్వారా గాని ఒక టీఎంసీ నీటినీ గోదావరి నదులు విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అన్నారు.

👉 మేడారం రిజర్వాయర్లో ప్రతి సారి కాకుండా ఈ ఏడాది నీటిమట్టం తగ్గడం జరిగింది, దాని గురించి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

👉 తాము ఇచ్చిన వినతుల పైన మంత్రి సానుకూలంగా స్పందించారు, గోదావరిలో 2 రోజుల్లో నీటి విడుదలకు హామీ ఇచ్చారన్నారు.

👉 నంది మేడారం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో అప్పుడు ఉన్న పాలకులు నీటి వాట గురించి పట్టించుకోకుండా నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఇక్కడి నీటిని సిరిసిల్ల, సిద్దిపేటకు తరలిస్తున్న కనీసం మాట అయినా మాట్లాడలేదు అని అన్నారు.