👉 ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
శతాబ్దాలు సనాతన ప్రాచీన చరిత్ర గల కోటిలింగాల పుణ్యక్షేత్రాన్ని భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి చేస్తా అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నియోజకవర్గంలో వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో సోమవారం ప్రభుత్వ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఆలయంలోని కోటేశ్వర స్వామినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవాదాయ, ఇరిగేషన్, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో పాల్గొని ఆలయ అభివృద్ధి మరియు ఇతరత్రా అంశాల పై అధికారులు వివరాలు అడిగి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ …
ఆలయ అభివృద్ధికి విషయంలో అధికారులు నిర్లక్ష్యం పనికిరాదని, ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. త్రాగునీటి మరుగుదొడ్ల నిర్మాణం, వంటివి పూర్తి చేయాలని, వచ్చే భక్తులకు బట్టలు మార్చుకోవడానికి శాశ్వత షేడ్ నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు.

👉సాగునీటి సమస్య రావద్దు..
మండల రైతాంగానికి సాగు నీటికి విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎమ్మెల్యే అధికారులను కోరారు.
ఏ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే ఆ ప్రాంత అభివృద్ధికి కాంట్రాక్ట్ సంస్థలు, ఏజెన్సీలు, CSR ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) నిధులను కేటాయిస్తారని అన్నారు. గత ప్రభుత్వ పాలకులు వాటిని పట్టించుకోలేదని, గత ప్రభుత్వంలో దాదాపు ₹ 20 వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం లింక్ 2 నిర్మాణం ద్వారా ఇక్కడి నీటినీ సిద్దిపేటకి తరలించడం జరిగిందని, మెగా కంపెనీ యాజమాన్యం ఈ ప్రాంతానికి సంబంధించి ప్రతి రూపాయిని ఇక్కడి అభివృద్ధికే CSR నిధులు వినియోగించాలని ఎమ్మెల్యే అన్నారు.

ఈ ప్రాంత పారిశుధ్యం విషయంలో కూడా ₹ 2 లక్షల 99 వేల రూపాయల నిధులు మంజూరు అయి ఉన్నాయని అదనంగా మరో ₹ 3 లక్షల రూపాయల కావాలని అధికారులు తన దృష్టికి తెచ్చారని ఎమ్మెల్యే వివరించారు. నా ACDP నిధుల నుండీ ₹ 3 లక్షల రూపాయలను కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు