సొసైటి లెక్కలు అడిగితే హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు ?

👉 గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుము కుంటున్నారు !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు సొసైటి లెక్కల సమాచారం అడిగితే హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు ?


మంత్రి హోదాలో ఉండి రొల్లవాగు ప్రాజెక్ట్ కి ఫారెస్ట్ క్లియరెన్స్ ఎందుకు లేదు ? ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ మెడికల్ కళాశాల వసతి గృహంలో ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.


👉సమావేశ ముఖ్యాంశాలు.


👉🏻 రాష్ట్ర ప్రజానీకానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి మండలం కమలపూర్, వెల్గటూర్ మండలం చేగ్యం,ఎండపెల్లి మండలం రాజరంపల్లి,గొల్లపల్లి మండలం అబ్బాపూర్, పెగడపెల్లి మండలం ల్యాగల మర్రి గ్రామాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభం చేయడం జరుగుతుంది.


👉🏻 ఈ సంధర్బంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షన సిఎం రేవంత్ రెడ్డి కి,రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆన్నారు


👉🏻సహకార సొసైటిల నుండి రైతుల వారి అవసరానికి రుణాలు తీసుకొని వాటిని సాగుకు మరియు ఇతరత్రా అవసరాలకు వినియోగించడం జరుగుతుంది.


👉🏻 గత 10 సంవత్సరాల్లో నియోజకవర్గంలోనీ ధర్మపురి, పెగడపెల్లి, గొల్లపెల్లి సొసైటీలను బిఆర్ఎస్ పాలకులు, పార్టీ సొసైటి చైర్మన్లు మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది.


👉🏻 సొసైటిలలో గత 10 సంవత్సరాల్లో రైతుల డబ్బు ఎంత,? ఎంత డ్రా చేశారు,? ఎందుకు డ్రా చేశారు ?వాటి లెక్కలు ఏమిటి అని ? విచారణ జరపాలని 2.09.2024 నాడు సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ నీ కలిసి రిప్రసంటేషన్ ఇవ్వడం జరిగింది


👉🏻 తన వినతిపై హైదరాబాద్ నుండి విచారణ కమిటీ వచ్చి 10.09.2024 నుండి 23.09.2024 వరకు సొసైటిలపై విచారణ జరిపి నివేదికను తయారు చేయడం జరిగింది


👉🏻అట్టి నివేదికను 25.09.2024 ప్రిన్సిపల్ సెక్రటరీ కి అందించాల్సి ఉండగా 24.09.2024 తేదిన బి.ఆర్.ఎస్ పార్టీ సొసైటి వారు మాపైన అన్యాయంగా విచారణ జరిపారు అంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.


👉🏻 శాసన సభ్యుడిగా, ప్రజా ప్రతినిధిగా, రైతుల డబ్బులు ఎంత వచ్చాయి,? ఎందుకు డ్రా చేశారు,? ఎంత డ్రా చేశారు ? అని మాత్రమే అడగటం జరిగింది. దీని పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాపై కక్ష సాధింపు చర్యలు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.


👉🏻 పెగడపెల్లి మండల సొసైటి నుండి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండ ₹ 1కోటి 64 లక్షల రూపాయలను షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి డ్రా చేయడం జరిగింది, దాన్ని ఎందుకు కట్టారు, దాని వల్ల రైతులకు ఏమి లాభం..


👉🏻 దాని గురించి మేము ప్రశ్నిస్తే మమల్ని, మా కార్యకర్తలను వాడు, విడు అని మాట్లాడటం, మమల్ని అమర్యాదగా దూషించడం వంటివి పనులు చేస్తున్నారు.


👉🏻2014 నుండి 2023 వరకు బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని సొసైటీలో ఎక్కడ పారదర్శకత, ఒక అకౌంటబిలిటీ గాని లేదు.


👉🏻2016లో 60 కోట్లతో ప్రారంభం అయిన రోళ్లవాగు ప్రాజెక్ట్ 160 కోట్లకు వ్యయాన్ని పెంచిన దానీ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేదు, అప్పుడు కొప్పుల ఈశ్వర్ ఒక మంత్రి హోదాలో ఉండి కూడా ఈ ప్రాజెక్ట్ కి ఫారెస్ట్ క్లియరెన్స్ ను తీసుకురాలేకపోయారు.ఇక్కడి నీటిని సిరిసిల్ల,సిద్దిపేట, గజ్వేల్ తరలించిన ప్రేక్షక పాత్ర వహించారు.


👉🏻ఇటీవల గోదావరిలో నీరు లేక రైతుల సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు వచ్చి చెప్తే ఇరిగేషన్ మంత్రి ,ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లి ఒక టిఎంసి నీటిని గోదావరిలోకి విడుదల చేయించడం జరిగింది.


👉🏻.కొప్పుల ఈశ్వర్ అప్పుడు మంత్రి హోదాలో ఉండి రైతులు నీ దగ్గరకు వచ్చి మిల్లర్లు కట్టింగ్ పేరుతో దోచుకుంటున్నారు అంటే మీరు మిలర్లతో మాట్లాడుకొండి అని రైతులకు వ్యంగ్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయారు.ఇది మీ అప్పటి పాలన.


👉🏻చట్టానికి లోబడి వారికి నోటిసులు పంపిస్తాం, వారిపైన విచారణ జరిపిస్తాం, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. మాకు వ్యక్తిగతంగా ఎవరి పైన కోపం లేదు, కేవలం రైతుల డబ్బులకు అకౌంటబిలిటీ ఉండాలని మాత్రమే చెప్తున్నాం
.