J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ సంయుక్తంగా అమలు చేయనున్న టూరిజమ్ ప్యాకేజీలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు స్థానం కల్పించారు.
తెలంగా లో పుణ్యక్షేత్రముల దర్శనార్థం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు దేవాదాయశాఖ మరియు తెలంగాణ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సమన్వయంతో ప్రత్యేక టూర్ ప్యాకేజ్ ను ఏర్పాటు చేసింది.
👉రెండు రోజుల టూర్ ప్రోగ్రామ్ !
హైదరాబాద్ – కరీంనగర్ – హైదరాబాద్

👉మొదటి రోజు..
ఉదయం 6:00 గంటలకు హైదరాబాదు నుండి ప్రారంభం. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కొమురవెల్లి, శ్రీ కొండ పోచమ్మ ఆలయం. నర్సాపూర్. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ, ఆంజనేయ స్వామి ఆలయం కొండగట్టు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ధర్మపురి. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కాలేశ్వరం. ( రాత్రి బస )
👉రెండవ రోజు…
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, సిద్దిపేట, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం రేకులకుంట, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దుబ్బాక, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నాచారం గుట్ట, శ్రీ వీరభద్ర స్వామి ఆలయం బొంతుపల్లి. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ కు.
👉ప్యాకేజీ ₹ 4,690/- పిల్లలకు ₹.3,752/-
నాన్ ఏసీ రవాణా, ఏసి గదులు హరిత హోటల్స్ లో బస
👉ఈ టూర్ ప్యాకేజ్ యాత్రికుల డిమాండ్ మేరకు శని, ఆదివారములలో నిర్వహింపబడునని తెలంగాణ టూరిజమ్ ప్రకటనలో పేర్కొన్నారు.