తిరుమలలో ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్ బి.ఆర్ నాయుడు !

J.SURENDER KUMAR,


వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను టిటిడి ఛైర్మన్  బిఆర్ నాయుడు శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈఓ శ్రీ జె శ్యామలరావు, అడిషనల్ ఈఓ  సి హెచ్ వెంకయ్య చౌదరి మరియు ఇతర అధికారులతో కలిసి చైర్మన్ ముందుగా బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఎస్ఎస్‌డి టోకెన్ జారీ కౌంటర్లను పరిశీలించారు.


అనంతరం ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కృష్ణతేజ రెస్ట్‌ హౌస్‌లోని క్యూ లైన్లు, ఇతర ఏర్పాట్లతో పాటు పెద్ద పండుగకు కేటాయించిన వివిధ పార్కింగ్ ప్రాంతాలను కూడా పరిశీలించారు. అనంతరం అన్నమయ్య భవన్‌లో వివిధ ఏర్పాట్లపై టీటీడీ, జిల్లా, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.
జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్‌వో  శ్రీధర్, ఎస్పీ సుబ్బరాయుడు, సీఈ  సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

👉అలిపిరి పాదాల మండపాన్ని సందర్శించిన చైర్మన్ !

టిటిడి ఛైర్మన్  బిఆర్ నాయుడు శనివారం అలిపిరి పాద మండపంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కేబుల్ అండ్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా తయారు చేసిన వెండి చెప్పులు, వెండి కిరీటం, వరద హస్తం, కటి హస్తం తదితర ఆభరణాలను సుమారు ₹ లక్షలు  శ్రీ పాదాల వేంకటేశ్వర స్వామి పీఠాధిపతికి చైర్మన్ చేతుల మీదుగా అందించారు.

టీటీడీ జేఈవో  (H & E) శ్రీమతి. గౌతమి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.