తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం !

J.SURENDER KUMAR,

జనవరి 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయంలో అనాదిగా వస్తున్న ఆలయ శుద్ధి కార్యక్రమం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం ఉప ఆలయాలు, ఆలయం లోపల పూజా సామాగ్రి, పైకప్పులు, స్తంభాలు మరియు గర్భగుడి గోడలపై పరిమళం అనే సుగంధ మిశ్రమంతో పూసి శుభ్రం చేశారు.

ధార్మికోత్సవం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, ఇఓ  జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉత్సవాల కంటే ముందుగా ఈ సంప్రదాయ ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. . పరిశుభ్రత కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

ఆలయ శుద్ధి కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు  భానుప్రకాష్ రెడ్డి, సాంబశివరావు,  రాజశేఖర్ గౌడ్, శ్రీమతి సుచిత్ర యెల్లా శ్రీమతి పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇతర అధికారులతోపాటు అదనపు ఈఓ  సిహెచ్ వెంకయ్య చౌదరి,

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్‌వో  శ్రీధర్, ఆలయ డివైఇవో  లోకనాథం తదితరులు పాల్గొన్నారు.