విజయవంతమైన రక్తదాన శిబిరం..!

👉 ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో !


J.SURENDER KUMAR,


మెదక్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరo విజయవంతమైంది.. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని హెల్ప్ ఆసుపత్రి లో నిర్వహించిన శిబిరంలో జిల్లాలోని మెడికల్ షాప్ యజమానులు పాల్గొని రక్త దానం చేశారు. AIOCD ఏర్పడి 50 సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు..
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,జిల్లా ప్రభుత్వ రక్త నిధి కేంద్రం వారు కూడా పాల్గొన్నారు.


రక్తదానం మహాదానమని, ప్రతి ఒక్కఆరోగ్య వంతులు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని పలువురు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కోశాధికారి, జిల్లా అధ్యక్షులు తోడుపునూరి రాజు, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ దేమే యాదగిరి, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టం సంగమేశ్వర్, మెదక్ మున్సిపాలిటీ 13 వ వార్డు కౌన్సిలర్ వి.సులోచన ప్రభు రెడ్డి, రాగం శ్రీనివాస్, కృష్ణ గౌడ్, నయీమ్, వీరమల్లి రమేష్, నేహా వెంకటేశం, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి తోగరి సుభాష్ చంద్రబోస్ , కోశాధికారి డి. జి .శ్రీనివాస్ శర్మ, కార్యవర్గ సభ్యుడు మద్దెల సత్యనారాయణ తో పాటు రక్త నిధి కేంద్రం అశోక్, జలాలుద్దీన్ లు పాల్గొని మెదక్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన దాతలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.