యుద్ధ ప్రాతిపదికన గోదావరిలోకి నీటి విడుదలకు మంత్రి ఆదేశం !

👉 ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి !

👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ల సమక్షంలో ఆదేశాలు జారీ !

👉 48 గంటల్లో గోదావరిలోకి ఒక టీఎంసీ నీరు రాక ?


J.SURENDER KUMAR,


యుద్ధ ప్రాతిపదికను గోదావరి నదిలోకి, నీటిని విడుదల చేసి జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ ప్రాంతాల రైతులకు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.


ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ టీ .జీవన్ రెడ్డి శుక్రవారం హైదరాబాదులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ని కలిసి గోదావరి నది పై ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లతో సాగవుతున్న పంటలకు నీరు అందడం లేదని. సదర్ఘాట్ వద్ద గేట్ల నిర్మాణం మరియు ఇతరత్రా కారణాల వల్ల గోదావరి లో నీటిమట్టం బాగా జరిగిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి నీటి విడుదలకు పట్టుపట్టారు.


మంత్రి తన చాంబర్ లో సంబంధిత ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం నీటి విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో పాల్గొనవలసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, నీటి విడుదల కోసం హైదరాబాద్ లో నా వద్దకు వచ్చారంటే సాగునీటి రైతు ఇబ్బందుల గురించి మీరు పరిస్థితిని అంచనా వేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , అధికారులకు వారి సమక్షంలో వివరించారు.