👉స్వామి వివేకానంద జయంతి సందర్భంగా..
@@@@
ప్రపంచానికి భారతదేశం యువ కేంద్రంగా నిలిచింది. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా మిగిలిపోతుంది యువ భారతానికి కొన్ని సమస్యలు ఉన్నాయి
దేశవ్యాప్తంగా 12వ జనవరి రోజున యువత ఉత్సాహభరితంగా శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ జాతీయ యువజన దినోత్సవం వేదికలను ఉదరగొట్టడం తెలిసిందే. భారతమాత ముద్దుబిడ్డ యువతలకు మార్గదర్శి తత్వవేత్త అపరిజ్ఞానీ పారిజాత ప్రపంచముందు భారతీయ హృదయాన్ని ఆసంతం ఆవిష్కరించిన ప్రఖ్యాత ప్రవచన కర్త, రచయిత స్వామి వివేకానంద పుట్టిన రోజును వారి జీవితం నుంచి ప్రేరణ పొంది జాతికి యువజన దినోత్సవం గుర్తించబడింది.
👉వినండి మారండి మార్పును కోరుకోండి !
జనాభా పరంగా చూస్తే మన దేశంలో 30 తో 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు 65% ఉన్నారు అనగా 80 కోట్లు ఏ దేశమైనా ఆర్థిక సాంస్కృతి సాంస్కృతిక రాజకీయ, సామాజిక రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఆ దేశ యువత చొరవ అనివార్యము యువత ఆలోచనలు శక్తి యుక్తులతో పాటు సృజన విలక్షణ భావ భావనలు ఉండాలి నేటి భారత యువతకు అల్లంత దూరంలో అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ వాటీని ముందుకు సాగనివ్వకుండా కొన్ని ప్రధాన సమస్యలు వెనక్కి లాగుతున్నాయి.
👉 యువతను వెంటాడుతున్న సమస్యలు నిరుద్యోగ భూతం !
నేడు ఐఐటి ముంబైలో చదివిన 36% యువతకు అర్హతకు తగిన ఉద్యోగాలు రాలేవని మీకు తెలుసా సంవత్సరానికి ₹10 లక్షల వార్షిక వేతనం మాత్రమే లభిస్తుందని తెలుసుకోవాలి. నిరుద్యోగ సమస్య ఇంత మేరకు ఉన్నదో అర్థం చేసుకోవాల్సిందే. భారత్ లో ఉన్న శ్రామిక శక్తిలో 80% వరకు యువత ఉద్యోగం దొరక్క సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారత్ నిరుద్యోగ రేటు 5.7 నుండి పెరిగింది 7.5 శాతానికి పెరిగింది అంటే దేశ యువతలో 90% వరకు అసంఘటిత రంగంలో ఉన్నారు. శ్రామిక వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు అనే విషయం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
విద్యా ప్రమాణాల లోటు నైపుణ్యాలలో కొరత మన దేశంలో విద్యా విధానం పాత పద్ధతిలోనే బోధిస్తున్నారు, పరిశోధన స్ఫూర్తి లేక విద్యకు తగిన అవి నైపుణ్యాలను ప్రపంచంలో కలిగిన యువతకు ఉద్యోగాలు ఆహ్వానము ఉంటుంది. మనదేశ యువతకు ఆత్మవిశ్వాసంతో విద్యా విధానం ఉండాలి నాణ్యమైన విద్య వస్తుంది దాని కోసము మనం కృషి చేయాలి.
అవసర వస్తువుల ధరలు మధ్యతరగతి వ్యక్తులకు సరైన ధరలకు లభించకపోవడం దీనివల్ల ఆదాయం తగ్గిపోయి ధరలు పెరుగుతున్నాయి. యువతలో పెరిగిన మాదకద్రవ్యాల వ్యసనం ఓ కారణం.
ఎనిమిది కోట్ల మంది అనగా 10. 15 వయసు గల పిల్లలు మాదకద్రవ్యాల బారిన పడి తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దీని నుండి తప్పించడము అందరి బాధ్యత. ఆల్కహాల్ సేవించడం వల్ల 5.7 కోట్ల మంది అనారోగ్య భారీన పడుతున్నారు. ఈ దుర అలవాట్ల చికిత్స పొందిన 63.6% మందికి 1.5 ఏళ్ల లోపు వారే దురాలవాట్ల బారిన పడుతున్నట్టు నివేదిక స్పష్టం చేస్తున్నాయి. ఆల్కహాల్ ఇతర మారకద్రవ్యాలు గంజాయి తదితర సేవనంలో 18 సంవత్సరాల వారే అధికంగా ఉండడం శోచనీయం.
సామాజిక మాధ్యమాల దుర అలవాట్లు నేటి డిజిటల్ పిల్లలు యువత నుండి స్మార్ట్ ఫోన్స్ ఐఫోన్ లాప్టాప్స్ టీవీ తదితర అనారోగ్య విపత్తుకు బానిసలుగా మారిపోతున్నారు స్మార్ట్ఫోన్ తో ఇతరులపై దృష్టిని కేంద్రీకరించి యువత మన ముందే అగుపిస్తున్నారు. ఈ దుర అలవాట్ల నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి, ఏకాగ్రత లోపిస్తుంది, చదువులు కుంగిపడడం, చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది . 18 నుంచి 24 ఏళ్ల లోపు యువతలో 50 శాతం మంది మానసిక అనారోగ్య సమస్యల విష వలయంలో చిక్కుతున్నారు అని సర్వేలు తెలియజేస్తున్నాయి.
గతంలో కరోనా అనే మహమ్మారి భారత దేశంలో ప్రపంచంలో ప్రవేశించింది 41 శాతం ఈ 30% ఏళ్లలోపు యువత చోటు చేసుకున్నారు. అత్యధిక మరణాలకు కారణం ఆత్మహత్యలే అని తెలుస్తుంది దీని నివారించకపోతే బావి తరాల వారు నష్టపోతారు. దీనికి తోడు యువతలో స్థూలకాయ సమస్య వెంటాడుతున్నది,
ప్రపంచంలోనే 197 దేశాల జాబితాలలో భారతదేశము 180 ర్యాంకులో ఉన్నది భారత మహిళల స్థానం 182వ స్థానం పురుషులది 180 వ స్థానం లో ఉంది. పిల్లలు ( అధిక బరువు) 12.5 మిలియన్లు ఉన్నారు. 20 ఏళ్లు దాటిన వారు మహిళలు 44 మిలియన్లు, పురుషులు 26 మిలియన్లు స్థూలకాయ సమస్యలతో బాధపడుతున్నారు అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అధిక బరువు బరువుకి కారణం అనారోగ్య ఆహారపు అలవాట్లు కొవ్వులు గలిగిన ప్రదార్థాలు షుగర్ పెంచే ఫాస్ట్ ఫుడ్ జింక్ ఫుడ్ శీతల పానీయాలు చప్పరించడం శారీరక శ్రమ లోపించడం ఈ వింత పోకడలకు కారణం. యువత అధిక రక్తపోటు, అధిక మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటివి వేధిస్తాయి, బాధిస్తాయి దాని నుండి యువత మేలుకో ఈ ప్రపంచాన్ని మార్చుకో భారతదేశాన్ని రక్షించుకో !
👉వ్యాసకర్త !

శ్రీమతి కాంత కుమారి,
రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ధర్మపురి !