ఆదాయానికి మించి డిటిఓ ఆస్తులు 4 కోట్ల పైనే !

👉ఏసీబీ దాడుల్లో వెలుగు ..


J.SURENDER KUMAR,


వరంగల్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌ ఆదాయానికి మించి. ₹ 4,04,78,767/- ( నాలుగు కోట్ల నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఏడు రూపాయలు ) తన సర్వీసులో అవినీతికి పాల్పడి సంపాదించినట్టు ఏసిబి గుర్తించింది.


శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ ప్రత్యేక బృందాలు వరంగల్ జగిత్యాల తదితర మొత్తం 5 ప్రదేశాలలో డిటిఓ బంధువుల నివాసాలలో దాడులు నిర్వహించారు.


👉దాడులలో..


ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయి. 3- ఇళ్ల డాక్యుమెంట్లు విలువ. ₹ 2,79,32,740/-, 16-ఓపెన్ ప్లాట్ డాక్యుమెంట్లు విలువ ₹. 13,57,500/- 15 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు అతని పేరు మీద అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద విలువ ₹ 14,04,768/. అధికారిక విలువ కంటే మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా.

ఇంకా, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ₹.5,85,409/-, గృహోపకరణాలు విలువ ₹. 22,85,700/-, వాహనాలు (నాలుగు చక్రాల వాహనాలు-3, ద్విచక్ర వాహనం-1) విలువ ₹. 43,80,000/-, బంగారు ఆభరణాలు సుమారు 1542.8 గ్రాములు విలువ ₹19,55,650/-, సుమారు 400 గ్రాముల వెండి ఆభరణాలు విలువ ₹ 28,000/- మరియు 23 విదేశీ మద్యం సీసాలు విలువ ₹ 5,29,000/- లభించాయి. అని ఎసిబి అధికారులు వివరించారు.

మరో 23 విదేశీ మద్యం సీసాలు విలువ ₹ 5,29,000/- అక్రమ మద్యం ఉన్నట్లు శంకర్‌పల్లి ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ప్రత్యేక పంచనామా నిర్వహించారు మరియు అతనిపై COR (క్రైమ్ ఆక్యురెన్స్ రిపోర్ట్) నం. 15/2025 U/s 34(a) TG ఎక్సైజ్ చట్టం, 1968 కింద ప్రత్యేక ఎక్సైజ్ కేసు కూడా నమోదు చేసినట్టు తెలిపారు.
నిందితుడైన డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ పుప్పాల శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, చేసినట్టు ఏసీబీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
.