J.SURENDER KUMAR,
చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు సౌందర్ రాజన్ పై భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీమడేలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఆలయం ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారథి శర్మ మాట్లాడుతూ భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధాన కర్తగా ఉండే ఆలయ అర్చకుని పై భౌతిక దాడి కి పాల్ పాడడం శోచనీయం అన్నారు.
అర్చకో హరిస్సాక్షాత్ అని భక్తులు నమ్ముతారని అలాంటి అర్చకుని పై కఠినమైనటువంటి పదజాలాన్ని వాడుతూ రామరాజ్య స్థాపనకు మాతో కలిసి రావాలని వీర రాఘవరెడ్డి వ్యక్తి తన అనుచరులతో అర్చకుని పై ఒత్తిడి తీసుకురావడం ఖండిస్తున్నామన్నారు. మునుముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము ఇటువంటి వారిని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు.
రామరాజ్యంలో రాముడు దుష్టసంహారం మాత్రమే చేసినట్లు పురాణాలు చెబుతున్నాయని అన్నారు. అలాంటి మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పేరిట రాజ్యస్థాపన చేస్తాము అని గుండాల తరహాలో ఆర్చకుని నివాసమునకు వచ్చి తమకు సహకరించాలని అర్చకుని పై ఒత్తిడి తీసుకురావడం క్షమించరాని నేరమని అన్నారు.
ఇతరుల లాగా అర్చకుడు తన పైన దాడికి ప్రతి దాడి చేయడం జరగదని కానీ అర్చకుని మనసు బాధ చెందుతే దాని ప్రభావం సంబంధిత వ్యక్తుల పై ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి సదరు సంఘటన పై స్పందించి ఫోన్ ద్వారా ఆలయ అర్చకునితో మాట్లాడి మనోధైర్యం కలిగేలాగా హామీ ఇవ్వడం అట్లా హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.