అంగరంగ వైభవంగా బీరుపూర్ నరసింహుడి రథోత్సవం!


J.SURENDER KUMAR,


భక్తుల గోవింద నామస్మరణలతో బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది.


జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రముఖ పూణ్యకేత్రం మైన గుట్టా పై వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఉత్సవమైన రథోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.


సాయంత్రం లక్షలాది మంది భక్తజన సమూహం లో జరిగిన రథోత్సవ లో కరీంనగర్ జిల్లా నుండి కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి భక్తులు తరలిరావడంతో బీర్పూర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ కొండలు గోవింద నామస్మరణతో మారుమోగింది.


ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లు లో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రద్దీతో చిన్న పిల్లలు వృద్దులు స్వామీ వారి దర్శనానికి ఇబ్బందులు పడ్డారు.


ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి పల్లకిలో గరుడవాహనంపై భజభజంత్రీల మద్య గుట్టా పై నుంచి స్వామివారు గుట్టా కిందకి దిగారు.


అనంతరం రథం ముందు హోమం బలిహరణం తో ప్రత్యేక పూజలను నిర్వహించారు. వివిధ పూలతో అలంకరించి రథం పై స్వామి వారు సతీసమేతంగా అసినులయ్యారు.
రథోత్సవానికి తరలివచ్చిన భక్తజనం గోవింద నామస్మరణలతో రథాన్ని లాగారు.జగిత్యాల కు చెందిన మాజీ పోలీసులు మల్లయ్య వేషధారణ భక్తుల ను ఆకట్టుకుంది

ఆలయ అర్చకులు సంతోషార్యులు, మదుకుమార్ చార్యులు, చిన్న సంతోష్ చార్యులు, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాల రాంచందర్ రావు ,మాజీ ఎంపిపి మసర్తి రమేష్ మాజీ జడ్పీ టిసి సభ్యురాలు పాథ పద్మ రమేష్ మాజీ వైఎస్ ఎంపిపి బి లక్ష్మన్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చేర్పురి సుభాష్ యాదవ్, కొల్ముల రమణ మాజీ సర్పంచ్ గర్సకుర్థి శిల్ప రమేష్ ఆలయ మాజీ ఆలయ చైర్మన్ లు ఎనగంటి సాగర్ గౌడ్, సుమన్, రమణా రావు గోడుగు కేశవులు, వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోలిస్ వారి అధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పోలిస్ లు బారి బందోబస్తు నిర్వహించారు