👉 ఇంచార్జ్ డాక్టర్ జ్యోతి రెడ్డి !
J.SURENDER KUMAR,
భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సి . అంజిరెడ్డిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం మనకున్నదని ఆ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ చిలుకూరి జ్యోతి రెడ్డి అన్నారు.

ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ధర్మారం ఎండపల్లి మండల కేంద్రాలలో ఆమె మంగళవారం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. విద్యాసంస్థలు, పట్ట బద్రులు, నిరుద్యోగ యువతను కలిసి నరేంద్ర మోడీ పాలన, డబుల్ ఇంజన్ సర్కార్, తదితర అంశాలు వివరించారు.