అంజిరెడ్డి గెలుపుతో రాజకీయాల్లో ఓ మలుపు !

👉 ఇంచార్జ్ జ్యోతి రెడ్డి !


J.SURENDER KUMAR,


భారతీయ జనతా పార్టీ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి  సి అంజిరెడ్డి గెలుపు ఉత్తర తెలంగాణ జిల్లాలో సంచలన రాజకీయ మలుపు కానున్నదని ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి చిలుకూరి జ్యోతి రెడ్డి అన్నారు.


గురువారం బిజెపి శ్రేణులతో కలసి ఆమె బుగ్గారం మండల కేంద్రం, వెలుగొండ గ్రామాలలో  ప్రచారం చేశారు. గ్రామంలో వాల్ పోస్టర్ అంటించారు. ప్రచారంలో భాగంగా మోడీ నాయకత్వం, బిజెపి పథకాలను డబ్బుల్ ఇంజన్ సర్కార్, తదితర అంశాలను జ్యోతి రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు


భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సి . అంజిరెడ్డిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం మనకున్నదని డాక్టర్ చిలుకూరి జ్యోతి రెడ్డి పట్టబద్రులకు విజ్ఞప్తి చేశారు.