అన్న , నవోదయ మార్చకుండా కేంద్రంతో మాట్లాడండి !

👉 సీఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి !


J.SURENDER KUMAR,


నవోదయ విద్యాలయాన్ని మార్పు చేయకుండా నేరెల్ల లోనే ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వని కి లేఖ రాయాల్సిందిగా సిఎం రేవంత్ రెడ్డిని ధర్మపురి ఎమ్మెల్యే ,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కోరారు.


కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం కరీంనగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్  కుమార్ ,  రేవంత్ రెడ్డి తో  నియోజకవర్గ సాగునీటి ప్రాజెక్ట్ ల అంశంతో పాటు , నియోజకవర్గంలోని నేరేల్ల వద్ద కేటాయించిన నవోదయ విద్యాలయాన్ని తరలించకుండా నెరెళ్ళ లోనే ఉంచే విధంగా మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పక్షాన  లేఖ రాయాల్సిందిగా కోరారు.  ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సామకూలంగా స్పందించారు