బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన ఎల్తురి పోచమ్మ ప్రమాదవశాత్తూ మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రాజమ్మ మృత దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ₹ 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.


👉మాజీ సింగిల్ విండో సభ్యుడి కుటుంబాన్ని..


అనంతరం అదే గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో ఛైర్మెన్ పీర్మహమ్మద్ తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.