J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా మండల కేంద్రమైన బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర ఆదాయం ₹ 26 లక్షల 33 వేల 525 /- ఆదాయం వచ్చింది.
బుధవారం స్వామివారి హుండీ లెక్కించగా మొత్తము ఆదాయము రూపాయలు ₹ 13,69,163 /- వచ్చింది. మిశ్రమ బంగారం 06 గ్రాములు , మిశ్రమ వెండి 01 కిలో 280 గ్రాములు , 20 విదేశి నోట్స్ వచ్చాయి. ఈ జాతరలో వేలం ద్వారా ₹ 7,10,000/- టికెట్ ల అమ్మకం ద్వారా ₹ 5, 54, 362/- మొత్తం కలిపి ₹ 26,33,525/ వచ్చిందని, గత సంవత్సరం కంటే ₹ 26 వేలు అధికంగా వచ్చిందని ఈ ఓ సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

హుండీ లెక్కింపు లో దేవాదాయశాఖ జగిత్యాల జిల్లా పరిశీలకులు M. రాజమౌళి , జిల్లా కే డి సి బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంఛంధర్ రావు, మాజి మండల పరిషత్ అధ్యక్షుడు మసర్తి రమేష్ , దేవస్థానం రెనవేషన్ కమిటి మాజి అధ్యక్షులు A. సామ్రాట్, N. సుమన్ , మాజి సర్పంచ్ శిల్ప రమేష్ , మాజి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి జితేందర్ , భీరుపూర్ పొలీస్ స్టేషన్ సిబ్బంది R.సత్యనారాయణ , B. వెంకటేష్ , భీరుపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చకులు వొద్దిపర్తి సంతోష్ కుమార్ , తిరుమల సేవా గ్రూప్ ఇంచార్జి A.రవీందర్ & సభ్యులు దేవస్థానం సిబ్బంది భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.