J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలో వివిధ సంఘటనలలో మృతి చెందిన, గాయపడిన, బాధిత కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం పరామర్శించి ఓదార్చారు.

ఎండపెల్లి మండలం గుళ్ళకోట, కొండాపూర్ గ్రామలలో మృతి చెందిన బాలుడు మంత్రి వేదాన్స్ కుటుంబాన్ని, గ్రామంలో పలు బాధిత కుటుంబాలను, మండల కేంద్రానికి చెందిన చీకటి వెంకటేష్ కుటుంబ సభ్యులను ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.

👉 ఎస్సై శ్వేత కుటుంబాన్ని..

ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్వేత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ శ్వేత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు.

వెలుగొండ గ్రామానికి చెందిన శేఖర్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడి జగిత్యాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్యే శేఖర్ అన్న పరామర్శించి అందించాలని వైద్యులను కోరారు.