👉 బీజేపీ కీలక నాయకుల సమీక్ష లో..
J.SURENDER KUMAR,
బిజెపి బలపరచిన అభ్యర్థులు సి. అంజిరెడ్డి ( పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ) మరియు మల్క కొమరయ్య ( ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్ధి ), ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సిందే అని ఈ మేరకు బీజేపీ కీలక నాయకులు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలకు పలు సూచనలు చేశారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించారు. బిజెపి ఎమ్మెల్యేలు, శాసనసభాపక్ష ఉపనేతలు, పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు అని చింతల రామచంద్ర రెడ్డి, ఎన్.వీ.ఎస్.ఎస్ ప్రభాకర్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రేశేఖర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘ నాయకులు, పట్టభద్రుల, బిజెపి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి పలు సూచనలు, చేశారు.
ప్రచారంలో..
బిజెపి బలపరచిన అభ్యర్థులు సి. అంజిరెడ్డి ( పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా) మల్క కొమరయ్య ( ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్ధి ), డోర్ టు డోర్. మౌత్ టు మౌత్ ప్రచారం చేయాలి అని ప్రచార కార్యాచరణను గూర్చి వివరించారు.