👉 ఏడాదిన్నర లోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే !
👉 ఐటి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు !
J.SURENDER KUMAR,
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 317 జీవో కు రూపకల్పన చేయడం, కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి జోనల్ వ్యవస్థ తో ఉద్యోగుల ఇబ్బందులు పరిశీలించకుండా రాష్ట్రపతి కి సిఫారసు చేసి ఆమోదింప చేయడం ఆ పార్టీల అనాలోచిత చర్య అని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో పట్టభద్రులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం జోనల్ వ్యవస్థ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు , వాళ్ళ అభిప్రాయాలు కానీ, జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో అనుకూల, ప్రతికూల అంశాలు పరిగణంలోకి తీసుకోకుండా డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఢిల్లీకి పంపించారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఇబ్బందులు గమనించి 317 జీవో సడలింపు పై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నమని, భార్యాభర్తల, అనారోగ్యం, దివ్యాంగుల, తదితర ప్రత్యేక సందర్భాలలో మినహాయింపు కోసం కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
👉కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి కి అధిష్టానం అవకాశం ఇచ్చింది !
కాంగ్రెస్ పార్టీలో వేలాదిమంది సీనియర్ కీలక నాయకులు ఉన్నారని, విద్యాసంస్థల అధినేత, నిరుద్యోగ సమస్యలు, విద్యా సమస్యలు, ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన అవగాహన నాలుగు జిల్లాలలో విస్తరించిన విద్యాసంస్థలు విద్యార్థులు తల్లిదండ్రులతో సంబంధాలు కలిగి ఉండడం తో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని పార్టీ ఎంపిక చేసిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ప్రత్యర్థులు సోషల్ మీడియాలో నరేందర్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్నారని, 100 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులతో దుష్ప్రచారానికి కౌంటర్ చేయగలిగే సత్తా నరేందర్ రెడ్డి ఉందని, అయినా పట్టబద్రులు వాస్తవాలను పరిశీలించి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని మంత్రి కోరారు.
నిరుద్యోగుల నైపుణ్యాన్ని పెంచే విధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ప్రారంభించామని, గత ప్రభుత్వ హయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని,ఓటమి భయంతోనే నరేందర్ రెడ్డి పైన దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని,
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూతపడిన ధర్మపురి ప్రాంతంలోని సంస్కృతాంధ్ర కలశాలను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పట్టు పట్టి తిరిగి పునః ప్రారంభించుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.