సీఎం రేవంత్ రెడ్డికి అభినందనల పరంపరలు !


J.SURENDER KUMAR,


సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) సర్వేకు శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున ముఖ్యమంత్రి ని కలిసి అభినందనలు తెలియజేశారు.


పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ , మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనవాసరెడ్డి , ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు , వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ చాంబర్ లో ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలియజేశారు.


👉ఎస్సీ ప్రజా ప్రతినిధులు !


ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికలోని కీలకమైన మూడు అంశాలకు మంత్రిమండలిలో ఆమోదించి, శాసనసభలో ప్రకటన చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున అభినందనలు తెలియజేశారు.
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఎస్సీ సామాజిక వర్గ శాసనసభ్యులు ముఖ్యమంత్రి ని వారి చాంబర్‌లో కలిసి అభినందనలు తెలియజేశారు.