J.SURENDER KUMAR,
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బృందం దావోస్ సదస్సులో పాల్గొని క్రియాశీలక భాగస్వామ్యమైనందుకు ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బోర్జ్ బ్రెండె , మేనేజింగ్ డైరెక్టర్ మిరెక్ డూసెక్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా బలోపేతం చేయాలన్న రేవంత్ రెడ్డి దార్శనికతను వారు ప్రశంసించారు.
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొని వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి దాదాపు ₹ 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిన విషయం తెలిసిందే.
👉సీఎం ను కలసిన సద్గురు జగ్గీ వాసుదేవ్ !

ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసిన జగ్గీ వాసుదేవ్ ఈశా ఫౌండేషన్ కొనసాగిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి వివరించారు.