J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట కు అర్చకులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య , దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ లతో పాటు ఆలయ ఈవో ఆహ్వానించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగావీరు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
జూబ్లీహిల్స్ నివాసంలో గురువారం ముఖ్యమంత్రి ని కలిసి, ఈ నెల 23 న నిర్వహించే స్వామి వారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రికను, స్వామివారి ప్రసాదం అందించారు.