కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి బీఫామ్ !

J.SURENDER KUMAR,


కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి గా పోటీ చేస్తున్న ( ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ) వి. నరేందర్ రెడ్డి కి హైదరాబాదులో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బి ఫామ్ అందజేశారు.

ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మరియు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. తదితరులు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.