👉 మంత్రి శ్రీధర్ బాబుతో నాయకుల చర్చలు ?
J.SURENDER KUMAR,
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ ఫోర్స్ విద్యాసంస్థ అధినేత
నరేందర్ రెడ్డి కి సిపిఎస్ ఉద్యోగుల
మద్దతు ప్రకటించారని సమాచారం.
👉 శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మంత్రి శ్రీధర్ బాబును కలిసి మద్దతు ఇస్తామని వివరించినట్టు సమాచారం.
👉 ఈ సందర్భంగా మంత్రి దృష్టి కి తమ డిమాండ్ లు వివరించారు. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ లో ఓపిఎస్ పునరుద్ధరించిన రాజస్థాన్ ,ఛత్తీస్ ఘడ్ , ఝార్ఖండ్ ఇదే రాష్ట్రాల మాదిరి తెలంగాణలో కూడా పాత పెన్షన్ పునరుద్ధరించాలని ఈ ప్రతినిధి బృందం మంత్రిని కోరినట్టు తెలిసింది.
👉 కేంద్ర ప్రభుత్వ మెమోరాండం నెం.57/05/2021 అనుగుణంగా 2003 DSC వారికి మరియు టెక్నికల్ సమస్యలతో ఓపిఎస్ కు దూరం అయిన వారికి తక్షణ పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది.
👉 మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ కు, గురుకుల సొసైటీ లోని ఉపాధ్యాయ సిబ్బంది జీతాలను 010-జీతాలు హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా చెల్లించాలని ఈ బృందం కోరారు
మీరు ప్రతిపాదించిన డిమాండ్ లకు మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి. త్వరలో వీటిని నెరవేర్చుతామని హామీ ఇచ్చినట్టు ఆ సంఘ కీలక నాయకులు తెలిపారు.