👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
మహిళల అండర్ -19 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష కు ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి అభినందించారు.
👉 కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం గొంగడి త్రిష జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

👉 త్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించిన ముఖ్యమంత్రి అలాగే, అండర్ -19 ప్రపంచ కప్ టీం సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి ₹ 10 లక్షల రూపాయలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్ గారికి, ట్రైనర్ షాలిని కి ₹ 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.
👉 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిష కలిసిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు.