J.SURENDER KUMAR,
తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రం లోని తొమ్మిది జిల్లాల సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీ), మరియు రాష్ట్ర సహ కార కేంద్ర బ్యాంకు(టెస్కాబ్) పాలకవర్గాల పదవీకాల పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో 14ను జారీ చేసింది.
సహకార శాఖకే చెందిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ల పదవీకాలాన్ని మాత్రం పొడిగించలేదు.
వీటిలో. కొన్ని డీసీఎంఎస్ లలో భారీ గా అవినీతి అక్రమాలు జరిగినట్టు నిఘా వర్గాలు నివేదిక ఆధారంగా విచారణ కు ప్రభుత్వం రంగం సిద్దం చేసినట్టు సమాచారం.

👉నామినేటెడ్ నియామకాలకు అవకాశం.?
ఆరు నెలలపాటు లేదా ? మళ్లీ ఎన్నికలు జరిగే వరకు అని కాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పొడిగింపు వర్తిస్తుందని పేర్కొనడం ఇందుకు అవకాశం. పలు సంఘాలపై ఆరోప ణలు, అభియోగాల తోపాటు విపక్ష పార్టీలకు చెందిన వారు అధ్యకులుగా ఉన్నారు.
వారిని తొలగించడానికి ఈ నిబంధన పెట్టిందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల చట్టం 32లోని సబ్ సెక్షన్ 7(2) కింద పదవీకాలం ముగిసిన పాలకవర్గాలను తొలగించి స్థానంలో సంఘంలోని ఒక సభ్యుడిని పర్సన్ ఇన్చార్జిగా నియమించే అధికారం ప్రభుత్వా నికి ఉంది. దీని ఆధారంగా పలు సంఘాలకు నామి నేటెడ్ పర్సన్ ఇన్చార్జులను నియమిస్తారనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 900 వందలకు పైగా సింగిల్ విండో లు ఉన్నాయి.వీటి పదవి కాలం శనివారం తో ముగియనుంది. జగిత్యాల జిల్లాలో 51 సింగిల్ విండో లు ఉన్నాయి. ఇందులో కొన్ని విండోలలో కోట్లాది రూపాయల నిధులు గొలమల్ జరిగినట్టు ఆ శాఖ అధికారుల విచారణ లో నిర్ధారించారు. ఈ అంశంలో కొందరు హై కోర్టు కు వెళ్లారు.