👉 జగిత్యాల్ జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ అధ్యక్షతన..
J.SURENDER KUMAR,
ధర్మపురి లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై గురువారం రివ్యూ నిర్వహించారు.
మార్చి 10 వ తేదీ నుంచి 12 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
రవాణాశాఖ తరపున భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలనుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ఎండ వేడిమి కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిరి – చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు అధికారులను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు కేటాయించిన సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులందరూ సమన్వయంతో పని చేసే ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు.
ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
భక్తులకు 12 రోజుల పాటు ఉచిత అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ వో శ్రీనివాస్ పేర్కొన్నారు
ఈ సమావేశంలో ఎస్పీ ,అశోకకుమార్, డి.ఎస్.పి రఘు చందర్, ఈవో శ్రీనివాస్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్,
మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఎంపీడీవో మరియు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.