J.SURENDER KUMAR,
ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టి విధివిధానాలు ప్రకటించడం, చర్చ తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ మండలాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకలు నిర్వహించారు.
👉ధర్మపురి మండల కేంద్రంలో..

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
👉వెల్గటూర్ మండలం కేంద్రంలో..

వెల్గటూర్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ ఆధ్వర్యంలో
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
👉ధర్మారం మండలం కేంద్రంలో…

ధర్మారం మండలం కేంద్రంలో అంబేద్కర్ సంఘ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘ నంగా నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.