దేవుడి పేరుతో ఓట్లు అడిగే పార్టీ మాది కాదు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


దేవుడిని పేరు చెప్పి ఓట్లు అడిగే పార్టీ మాది కాదని, చేసిన పనిని చెప్పుకొని ఓట్లు అడిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధర్మపురి ఎమ్మెల్యేఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మారం మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు.


కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏమిటో ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలని, డిమాండ్ చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యువతను ఆదుకుంటాం ప్రతి సంవత్సరం లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి అధికారంలో కొనసాగుతుందని ఆరోపించారు.
మా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసి యువతకు అండగా ఉంటున్నామన్నారు.


పట్టభద్రులైన ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచించి నరేందర్ రెడ్డి కి సీరియల్ నెంబర్ 2 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.