ఫ్లాష్ ..పోస్ట్ ఆఫీస్ కు తాళం వేధింపులే కారణమా ?

J.SURENDER KUMAR,


ఆధునిక సాంకేతిక సేవలు అందుబాటులో లేని సమయంలో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సేవలందిస్తున్న భారత్ ప్రభుత్వ పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి తాళం వేసి ఓ ఉద్యోగి నిరసన దీక్ష చేపట్టాడు.

👉 వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ గత కొన్ని సంవత్సరాలుగా పరిసర గ్రామ లకు సేవలందిస్తూ అందుబాటులో ఉంది. అందులో విధులు నిర్వహించే ఉద్యోగి ( బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ) సోమవారం అధికారుల వేధింపులు భరించలేక పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి తాళం వేసి కార్యాలయం ముందు బైఠాయించారు.

అవసరాల నిమిత్తం పోస్ట్ ఆఫీస్ కి వచ్చిన వినియోగదారులు ఈ చర్యతో సమస్య ఏమిటీ ? అంటూ బీపీఎం ను అడిగారు. తాను అనారోగ్య తో ఉన్నాను. కొన్ని రోజులు సెలవు కావాలి అని అడిగిన అధికారులు ఇవ్వడం లేదని, పలుసార్లు అభ్యర్థించి విసిగి వేసారి బైఠాయించినట్టు గ్రామస్తులకు బిపిఎం వివరించాడు.

దీనికి తోడు అదనపు పనుల భారం, వ్యాపార టార్గెట్, వేధింపులకు గురి చేస్తున్నారని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరుగా పురోధిస్తూ తన గోడు వెల్లబోసుకున్నట్టు సమాచారం.

నిత్యం తమకు అందుబాటులో ఉండి సేవలందించే బిపిఎం ఆవేదనతో గ్రామస్తులకు ఆ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


దీనికి తోడు బ్రాంచ్ పోస్ట్ కార్యాలయం పర్యవేక్షించే ఓ అధికారి తీరు తో పలువురు బ్రాంచ్ పోస్టు మాస్టర్లు ఇబ్బందులు పడుతున్నారనే చర్చ .


ఈ అధికారి తీరుపై జిల్లా పోస్టల్ శాఖ సూపరిండెంట్ కు, డైరెక్టర్ కు గ్రామానికి చెందిన కొందరు పట్టబద్రులు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.