👉 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సభలో..
J.SURENDER KUMAR,
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో నిరుద్యోగ యువత కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన కూడా చేయలేదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం ధర్మపురి పట్టణ బ్రాహ్మణ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 56 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని, ధర్మపురిలో పునః ప్రారంభించడానికి సాధ్యం కాదు అంటూ నాటి బిఆర్ఎస్ పాలకులు ప్రకటించిన సంస్కృతాంధ్ర కలశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రి శ్రీధర్ బాబు ,మంత్రి కొండ సురేఖ సహకారంతో తిరిగి పునః ప్రారంబించడం జరిగిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు

.
సుమారు ₹100 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ ను ధర్మపురికి మంజూరు చేయడం జరిగిందని, బీజేపీ నాయకులు వచ్చి తమ అభ్యర్ధిని ఓటు వేయాలని అడిగితే మా ధర్మపురి లోని నేరెల్ల లో ఏర్పాటు చేయాలనుకున్న నవోదయ విద్యాలయాన్ని మీ పార్టీ ఎంపి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలని చూసారని, మా ప్రాంతం విద్య పరంగా అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా ? అని బీజేపీ నాయకులను, పట్టభద్రులు ప్రశ్నించాలని, లక్ష్మణ్ కుమార్. కోరారు.

పార్టీ నాయకులు కార్యకర్తలు కలసి కట్టుగా పనిచేసి నరేందర్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలని,పట్టభద్రులు నరేందర్ రెడ్డి బ్యాలెట్ పత్రం 2 నెంబరు పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలక్షన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.