J.SURENDER KUMAR,
గిరిజనుల పండగ మనందరి పండగ అని ధర్మపురి ఎంఎల్ఏ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ మహా రాజ్ జయంతి సందర్భంగా ఆదివారం ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామంలో జరిగిన
గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ మహా రాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని సేవలాల్ మహా రాజ్ ను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు.
ఈ సంధర్బంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ.

గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ మహా రాజ్ గారి జయంతి సందర్భంగా గిరిజన సోదర సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిజేస్తున్నమని, వారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలాల్ జయంతి సందర్భంగా ఈ రోజు సెలవును ప్రకటించి వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి అట్టి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందకరమైన విషయం అన్నారు.
ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ గిరిజనుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, గిరిజనుల పండగ అంటే మనందరి పండగ అని, ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సేవలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడంలో నావంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులను సేవలాల్ మహారాజ్ తో పోల్చడం సరైన పద్ధతి కాదని, సేవలాల్ కరుణ కటాక్షాలు, ఆశీర్వాదాలు మన ప్రాంత ప్రజల పైన ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మారం మండల మార్కెట్ చైర్మెన్, డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.