గోదావరిలో ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న కలెక్టర్ ఎస్పీ!

👉 నాలుగు ట్రాక్టర్లు సీజ్ కేసులు నమోదు !


J.SURENDER KUMAR,


ధర్మపురి మండలం దమ్మున్నపేట, ఆరేపల్లి గోదావరి నది తీరంలో బుధవారం అక్రమ ఇసుక రవాణా చేయడానికి లోడ్ చేసిన నాలుగు ట్రాక్టర్లు జెసిబి యంత్రాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ ప్రసాద్ ఇసుక లోడు తో ఉన్న వాహనాలను స్వయంగా పట్టుకున్నారు. ట్రాక్టర్ పై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ పోలీస్ శాఖ అధికారులకు ఆదేశించారు.

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని పట్టుకొని వారి నుండి వివరాలను తెలుసుకున్నారు. రోజు ఇసుక రవాణా చేస్తున్నారా ? ఇసుక ఎక్కడికి తరలిస్తున్నారు ? ఎక్కడ నిల్వ చేస్తున్నారు ? తదితర వివరాలు ఎస్పీ కలెక్టర్ ఆరా తీశారు. ఇసుక అక్రమంగా తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ హెచ్చరించారు.


బుధవారం రోజున ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట మరియు అరెపెల్లి గ్రామాల్లోని శివారులో ని గోదావరి నది ఇసుక రీచ్ వాగులను జిల్లా ఎస్పీ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న దమ్మన్నపేట గ్రామ శివారులోని గోదావరి నది లో స్వయంగా పోలీస్ బృందాలు రెవెన్యూ మైనింగ్ రవాణా అధికారులు కలిసి తనిఖీ చేశారు.
ఇసుక రీచ్ ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యెక బృందాలతో రాత్రి వేళల్లో విస్తృతంగా తనిఖీలో చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట, తహసిల్దార్ , మైనింగ్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.