కాలేశ్వర శ్రీ ముక్తేశ్వర ఆలయంలో ఘనంగామహా కుంభాభిషేకం !


J.SURENDER KUMAR


కాలేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో  మహా కుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది.


కాలేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవం కు  రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ , శాసనసభ్యులు గండ్ర సత్తన్న   పవిత్ర వేడుకలకు హాజరై, స్వామి వారి ఆశీస్సులు పొందారు.

👉ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో క్యాబినెట్ మంత్రులకు అధికారులు అలాంటి ప్రోటోకాల్ పాటించలేదు. మంత్రులు ఎమ్మెల్యేలు సామాన్య భక్తుల తరహాలో పూజారి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు సైతం ఇలాంటి రాజకీయ ప్రకటన లు చేయలేదు.


శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా కుంభాభిషేకంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు జరిగాయి.  వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తజనం  వేడుకల్లో పాల్గొని భక్తి పారవశ్యంతో స్వామివారిని దర్శించుకున్నారు.


మంగళ వాద్యాలతో ఆలయం లో భక్తి కోలాహలంగా మారింది. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం  నిర్వహించారు.

మహా పుణ్య కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ అర్చకులు, అధికారులు, భక్త సముదాయం, సేవాదారులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వామివారి కృప ఎల్లప్పుడూ భక్తులపై ఉండాలని రాష్ట్ర మంత్రులు ఆకాంక్షించారు..

ఈ మహోత్సవంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే ప్రసిద్ధ ప్రవచకుడు డాక్టర్ భాచంపల్లి కుమార్ శాస్త్రి తదితర అధికారులు భక్తజనం పాల్గొన్నారు