కోటిలింగాలలో భక్తులకు ఇబ్బందులు కలగవద్దు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ కోటిలింగాల స్వామి పుణ్యక్షేత్రానికి తరలివచ్చి వచ్చే భక్త జనంకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అధికారులను కోరారు.


వెల్గటూర్ మండలం కోటిలింగాల క్షేత్రంలో శ్రీ కోటేశ్వర స్వామి నీ మంగళవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంధర్బంగా బుధవారం జరగనున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు.


ప్రైవేటు కంపెనీ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన బట్టలు మార్చుకునే షేడ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా షెడ్ నిర్మాణాన్ని పూర్తి చేసిన కంపెనీ యాజమాన్యానికి అభినందనలు తెలిపిన

ఎమ్మెల్యే ఇదే తరహాలో ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) CSR ఫండ్స్ కూడా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, కోటిలింగాల దేవస్థానం, మరియు ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగించాలని, ఎన్నికల అనంతరం కంపెనీ డైరెక్టర్ ను కలిసి CSR నిధులను ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని వారిని ఎమ్మెల్యే కోరారు.