J.SURENDER KUMAR,
కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రమాదంలో ధర్మపురి నివాసి వంగల ప్రమీల ( 58 ) అనే మహిళ మృతి చెందింది .
కుంభమేళా నుండి తిరిగి వస్తూ మధ్యప్రదేశ్ లోని రేవా మండలంలో ప్రమాదం జరిగింది ప్రమాదానికి గల కారణాలను మృతురాలి కుమారుడు వెంగల శ్రీనివాస్ వివరించారు.
తాము ఫిబ్రవరి 7న కుంభమేళా కు కుటుంబంతో సహా ఇరుగు పొరుగు వారు కలిసి రెండు కార్లలో వెళ్లామని శ్రీనివాస్ తెలిపాడు. కుంభమేళా ( ప్రయగరాజ్ ) నుండి అయోధ్య అక్కడి నుండి తిరుగు ప్రయాణం లో కాశీ క్షేత్రాన్ని దర్శించుకొని వస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ లో ప్రమాదం జరిగిందని, ఎదురుగా వస్తున్న వాహనాన్నీ తప్పించబోయే క్రమంలొనే ప్రమాదం జరిగినట్లు శ్రీనివాస్ తెలిపారు.

ఫిబ్రవరి 13న జరిగిన ఈ ప్రమాదం లో తమ తల్లికి కొద్దిపాటి గాయాలు కాగా మధ్యప్రదేశ్ లోని రేవా లోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినట్ల తెలిపారు. ప్రమాదం కు గురైన కారు నెంబర్ టిజి.02 బి.0378 గల కారులో వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం లో గాయపడిన ప్రమీల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుమారుడు శ్రీనివాస్ తెలిపారు.
మృతి చెందిన ప్రమీలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమీల ధర్మపురి గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుందని, ఇటీవలనే భర్త గుండెపోటుతో మృతి చెందారు . వీరి స్వగ్రామం జులపల్లి . మండలం మృతదేహం కు పోస్టు మార్ట్ పూర్తి చేశారు.. మృతదేహం సోమవారం జులపల్లి రానున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు