👉ఎమ్మెల్సీ, ఎంఎల్ఏ, జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా కృషిచేయాలి అని ఎమ్మెల్సీ, ఎంఎల్ఏ జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ లు అన్నారు.
పట్టణంలోని పొన్నాల గార్డెన్స్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మద్దతుగా ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మరియు జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎంఎల్ఏ మీడియా సమావేశం లో కొన్ని పాయింట్స్…
👉 రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు స్థాపించి, వేలాది మందికి విద్యా బోధన చేసిన విద్యా వేత్త నరేందర్ రెడ్డి నీ ఘన విజయం సాధించేలా సమష్టిగా కృషి చేయాలి..
👉 కాంగ్రెస్ పక్షాన శాసన మండలి లో ఏకైక సభ్యుడిగా నాటి బీ ఆర్ ఎస్ పాలన లో ప్రజా వ్యతిరేక విధానాల్ని నిలదీస్తూ, ప్రజా గొంతుక గా పని చేశానని గుర్తు చేశారు.
👉 విద్యా వ్యవస్థలో నరేందర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్..
👉 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి, మెరుగైన విద్యా బోధన అందజేస్తూ, బ్రాండ్ గా నిలిచారు.
👉 నరేందర్ రెడ్డి అందరి గెలుపుగా భావించాలి అని పిలుపునిచ్చారు..
👉 గత ప్రభుత్వం కనీసం టెట్ కూడా నిర్వహించలేకపోయారు.
👉 ఎన్నికల కోడ్ అనంతరం మెగా డీ ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని సీఎం ప్రకటించారనీ గుర్తు చేశారు.
👉 ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, నరేందర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు.
👉 నరేందర్ రెడ్డి ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉంది.
👉 జగిత్యాలలో 30 వేల ఓట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
👉 నరేందర్ రెడ్డి కార్యదీక్ష, పట్టుదల తో లక్షలాది మంది విద్యార్థులను విద్యా వేత్తగా తీర్చిదిద్దారు.
👉 నరేందర్ రెడ్డి గెలుపు కోసం అకుంఠిత దీక్షతో సమష్టిగా కృషి చేసి గెలిపించాలి.
👉 పదవి ఉన్నా, లేకున్నా నాకు అండగా నిలిచి, ఆత్మస్థైర్యం నింపిన కార్యకర్త ల అభిమానం ఎప్పుడూ ఉండాలాని కోరారు.
👉 జీవితంలో చివరి వరకు ప్రజలకు సేవలు అందిస్తాను..మీకు తోడుగా ఉంటా అని జీవన్ రెడ్డి లక్ష్మణ్ కుమార్ భరోసానిచ్చారు.