ఎమ్మెల్సీ గెలుపుకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విస్తృత ప్రచారం !

👉 గొల్లపల్లి, వెలగటూర్, పెగడపల్లి మండలాల్లో..


J.SURENDER KUMAR,


కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం  ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  గొల్లపెల్లి, వెల్గటూర్, పెగడపల్లి  మండలాలలో బుధవారం విస్తృతంగా ప్రచారం చేశారు.


👉 గొల్లపల్లి మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో పట్టభద్రులు, నిరుద్యోగ యువత కాంగ్రెస్ శ్రేణులతో ఎమ్మెల్యే ప్రచార సరళి తీరును సమీక్షించారు.


👉 వెల్గటూర్ మండల కేంద్రంలోని VSR గార్డెన్స్ లో పట్టభద్రులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.


👉 పెగడపెల్లి మండలం బతికపెల్లి గ్రామంలో  గడప గడప కు యువకులు కాంగ్రెస్ శ్రేణులు పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు.


👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…


ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా ! వీ నరేందర్ రెడ్డి కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కష్టపడి  అభ్యర్థి నరేందర్ రెడ్డి  గెలుపు కోసం కృషి చేయాలని, నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ధర్మపురి నియోజకవర్గ పట్టబద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి బ్యాలెట్ పత్రంలో 2 వ సంఖ్యపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం  సంవత్సర కాలం లోపే దాదాపు 56 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది

. గత 10 సంవత్సరాల్లో బి.ఆర్.ఎస్ ప్రభుత్వ పాలకులు  నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వమని, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి గడప గడపకు వెళ్లి పట్టభద్రుల ను కలిసి ప్రచారం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.