J.SURENDER KUMAR,
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గురువారం పరిశీలించారు.

ధర్మపురి పట్టణ కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల సమీపంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోహరించి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయవలసిందిగా కోరుతున్న నాయకులను కార్యకర్తలను, ఎమ్మెల్యే కలిసి వివరాలు అడిగారు.

కార్యకర్తలు కేంద్రంల సమీపంలోనే ఉండాలని ఓటు వేయడానికి వచ్చే ఓట్లరకు ఓటింగ్ విధానం పై అవగాహన కల్పించాలని,

దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను వాహన సౌకర్యం ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓటు హక్కును వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ సమయం పూర్తి అయ్యే వరకు ఉండాలని శ్రేణులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

మండల కేంద్రమైన గొల్లపల్లి పట్టణంలో. ఎండపల్లి మండల కేంద్రంలో. మండల కేంద్రమైన ధర్మారం పట్టణంలో, పెగడపల్లి మండల కేంద్రంలో. వెల్గటూర్ మండల కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాలను

పోలింగ్ సరళిని పరిశీలిస్తూ కాంగ్రెస్ శ్రేణులను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అప్రమత్తం చేశారు.