👉 ఎస్సీ ఎస్టీ బీసీ గ్రామీణ విద్యార్థులకు అన్యాయం చేయకండి !
👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఎస్సీ నియోజకవర్గమైన ధర్మపురి కి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నవోదయ విద్యాసంస్థ ను ఇక్కడ రద్దుచేసి ఇతర ప్రాంతానికి తరలించకండి అంటూ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కు విజ్ఞప్తి చేశారు.
80 శాతం గ్రామీణ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ గ్రామీణ విద్యార్థులకు ఏం చేయవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజకవర్గానికి నవోదయ మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మంజూరైన నవోదయ విద్యాసంస్థ తరలింపు ప్రయత్నాల పై ఎంఎల్ఏ లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
👉మీడియా సమావేశ ముఖ్యాంశాలు.
👉 గత 10 రోజుల క్రితం నిజామాబాద్ ఎంపి అరవింద్ నవోదయ విద్యా సంస్థ పెద్దపెల్లి పార్లమెంట్ పరిధిలో వద్దు అని నిజామాబాద్ పార్లమెంట్ కి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అని అన్నారు.
👉 కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత కూడా దాన్ని తరలించాలని చూడటం న్యాయమా ? సమంజసమా ? అని ఎంపీ అరవింద్ విశాల హృదయంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
👉 మంగళవారం డిల్లీ కి వెళ్లి ఎంపీ అరవింద్ ను , సంబంధిత నవోదయ శాఖ అధికారిని కలిసి వివరించి వినతి పత్రం ఇస్తానన్నారు
👉 నవోదయ సంస్థ అంశంలో తనకు ఎలాంటి భేషజాలు లేవు, ఈ అంశంపై ప్రధాన మంత్రి కి ఉత్తరం రాస్తాను, అపాయింట్మెంట్ దొరికితే తప్పకుండా వారిని కలుస్తాను. అన్నారు. ఈ అంశంలో తప్పకుండా ఎంపీ అరవింద సానుకూలంగా స్పందిస్తారని తాను భావిస్తున్నట్టు ఎమ్మెల్యే అన్నారు.
👉 నవోదయ అంశంలో సానుకూల స్పందన రాకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మా కార్యచరణ ప్రణాళిక ప్రకటిస్తా, విద్యార్థులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అన్నారు.
👉 నవోదయ విద్యాసంస్థ విషయంలో ఎక్కడ వెనుకను తగ్గె ప్రసక్తే లేదు అన్నారు
ప్రత్యేకంగా నిజాంబాద్ పార్లమెంటు పరిధిలో నీ సారంగాపూర్, బీర్పూర్, రాయికల్, జగిత్యాల గ్రామీణ మండలాలు ధర్మపురిలో నవోదయ విద్యా సంస్థ కోసం సేకరించిన నేరెళ్లకు సమీప మండలాలు అవి అన్నారు.
👉 ధర్మపురి మండలంలో 252 సర్వే నెంబర్ లో 30 ఎకరాల భూమి ఉంది నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాయడం జరిగింది అని ఎమ్మెల్యే అన్నారు
👉 దానికి సంబంధించి నేరేళ్ళ వద్ద సర్వేనెంబర్ పూర్తి స్థాయిలో నక్షతో సహా రాష్ట్ర విద్యశాఖకు పంపించడం జరిగింది అన్నారు.
👉 కేంద్ర ప్రభుత్వం 18 నవోదయ పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది, దానికి సంబంధించి ధర్మపురి లోని నేరేళ్ల గ్రామంలో విద్యాలయ ఏర్పాటుకు మంజూరు ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు.
👉 నూతన నవోదయ భవన నిర్మాణం జరిగే వరకు ధర్మపురిలో అన్ని వసతులతో నూతనంగా నిర్మితమైన ST హాస్టల్ భవనంలో ఈ విద్యా సంవత్సరం కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది అనే ఎమ్మెల్యే అన్నారు.
👉 భవనము ను సంబంధించి నవోదయ విద్యాలయ అధికారులు కూడా వచ్చి చూడటం జరిగింది, త్వరలో తరగతులు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నవోదయ విద్యాసంస్థ మంజూరు అనుమతులను మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చూపించారు.

👉 హనుమకొండ రాయపట్నం రాష్ట్ర రహదారి పాశిగామ వద్ద ఒక ట్రామ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ని కలిసి వినతి పత్రాన్ని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.